Thursday, September 12, 2013

ప్రేమ

మేఘం కరగట్లేదు... వర్షం కురవట్లేదు..,
నీ ఆలొచనల మద్య నేనింకా తడుస్తూనే ఉన్నా..!
అలల ప్రవాహంలో కన్నీరు కలుస్తూందే కానీ,
కలల ప్రవహం నుంచి కనులముందు సాక్షాత్కరించవూ..!!
నీవులెని సాయంత్రాలు-
మకరందాలూ, పరిమళాలూ వుండవు
అవశేషాలు తప్ప.
ఇపుడు మనసొక ప్లాస్టిక్ పూలతొట.
ఎవరికి తెలుసు? అంతఃసంఘర్షణలు..
నిన్నొక్కసారి కొల్పోడానికి
నన్ను నేనెన్నిసార్లు కోల్పోతున్నానో..!!

ఇపుడు క్షణమొక యుగం,
ప్రతి క్షణం లొ వివిధ 'నీవు ' లు.
మనిద్దరం కాలంతొపాటు ప్రయాణిస్తున్నాం..
ఒక క్షణం నుంచి మరో క్షణానికి,
ఒక జీవితం నుంచి మరో జీవితానికి.
అలా ఎంత కాలం గడిచిందో తెలీదు-..
. నా దేహం నీ ఒళ్ళొ కలగంటూ నిద్రిస్తూంది.
నీ ఒళ్ళో నా స్వప్నాల మధ్య నీవున్నావు..!
ఇపుడు రెందు జీవితాలు ప్రేమలో చిక్కుకున్నాయి
ఒక హ్రుదయంలో మరొకటి..
ఇక దాచుకోడానికి ఏమీలేదు..
పంచుకోడానికి ప్రేమ తప్ప...
                       .... స్వప్న

No comments:

Post a Comment