Thursday, September 12, 2013

మన నపుంసక కవిత్వాలు.

అక్షరాల్ని కూడబెట్టి
భావాల్ని బందీ చేసి
భాషతో గారడీలాడడమే కవిత్వం.
రాయడం మనకలవాటైంది
అందుకే ఆకలేసి కేకలేసినా
ఆ నక్షత్రాలు అదిరిపడ్డా
కడుపునింపని కవిత్వాన్ని
రాసాం రాస్తున్నాం రాస్తూనే ఉంటాం....!!


ఓ దిశ లేదు నిర్దేశము లేదు
గమ్యం లేదు లక్ష్యం అంతకన్నా లేదు
నేడు కాదు నిన్నకాదు
తరతరాలుగా ఇదేతంతు......!!

ప్రేయసి అలిగినపుడో
స్నేహితుడు విడిపోయినపుడో
జీవితం విరక్తి చెందినపుడో
ఒంటరితనంలో లేదా మద్యం మత్తులో కవిత్వాలే కవిత్వాలు...!!

మనసును మళ్లిస్తే
కవిత్వాల ప్రవాహమే కాని
తత్వం లేని శాస్త్రం లేని
నపుంసక కవిత్వాలు మనకెందుకు నేస్తం....!! 


No comments:

Post a Comment