Wednesday, October 8, 2014

“నీ మదిలో ఎందుకు శుంఠ "

కురిసిన వానకు 


పారే యేరుకు 


నిండిన చెరువుకు  


త్రాగే నీరుకు "వీటికి లేని అంటు"

 “నీ మదిలో ఎందుకు శుంఠ "


వెన్నెల వెలుగుకు 


వన్నెల గాలికి


సూర్యుని కిరణం 


మోసే నేలకు "వీటికి లేని అంటు"


“నీ మదిలో ఎందుకు శుంఠ "

పూచే పువ్వుకు

కాచే కాయకు 


పెంచిన తోటకు 


పండిన చోటకు "వీటికి లేని అంటు"


“నీ మదిలో ఎందుకు శుంఠ "


చెక్కే ఉలికి 


చేసిన సారెకు


నేసే మగ్గంకు


వేసిన పగ్గంకు "వీటికి లేని అంటు"


“నీ మదిలో ఎందుకు శుంఠ "


పంటను కాచిన వారిని 


చెప్పులు చేసిన వారిని 


గుడినే మెత్తిన వారిని


బడినే కట్టిన వారిని "తాకితె అంటే నంటే"


“మానవ శుంఠే నంటా

- పి.ఎన్ మూర్తి.    


pnmoor@gmail.com 


9441151672

No comments:

Post a Comment