Monday, September 23, 2013
Friday, September 13, 2013
న్యాయం జరిగిందా?
నిర్బయ కేసులో న్యాయం జరిగిందా
నలుగురి కి ఉరి పడితే నలబై కోట్ల నిర్బయలు నిర్బయంగా ఉండగలరా
మూలాలను మర్చిపోయి , మసిపూసి మారేడుకాయ లా
వ్యవస్తను మార్చకుండా , ఉరి తీసి సంబరం చేసుకోమంటే
చేసుకుంటాము సంబరం , ఇస్తార మాకు నిజమైన నిర్బయ హస్తం
నలబై రూపాయలకు ఏ సర్టిఫికేట్ సినిమా
పోర్న్ స్టార్ హీరొయిన్
గంటకు పది రూపాయలతో వీధి కోక సెక్స్ కేఫ్
సెల్ లో రూపాయికే నీలి చిత్రం
నియంత్రణ కోల్పోయి విచ్చలవిడిగా
నీలి సాహిత్యం ,
జబర్దస్త్ అంటూ అపహాస్యపు ప్రోగ్రాము
సంస్కారం లేని చదువులు
సంస్కారం నేర్పలేని సమాజం
మారదు మారదు సమాజం
మనలో మార్పు రానంతవరకు
-------------------స్వప్న
Thursday, September 12, 2013
Mr.యటకారం...
పిచ్చివాడా ... ! అమ్మాయిలూ గంటలు గంటలు ఏం మాట్లాడతారా...!
అదో డౌటు .... దానికి మళ్లీ క్లారిఫికేసన్లు..
రాత్రి మొగలి రేకులు సీరియల్లో హీరోయిన్ లేచిపోయిందా లేదా...?
నిన్న చారులో పిక్కున్న చింత పండు వాడారా... లేక పిక్క లేని చింతపండు వాడారా....?
నిన్న ఒకబ్బాయి నన్ను చూసి ఈలవేసాడు.. రేపు కన్ను కొడతాడా కొట్టాడా....?
లేకపోతె నాకు mr. యటకారం అని కత్తిలాంటి అబ్బాయి తగిలాడు... అతని డీటెయిల్స్ పంపనా ... లాంటి సొల్లు కొట్టు కుంటుంటారంతే ..
--- స్వప్న
Subscribe to:
Posts (Atom)