Wednesday, October 8, 2014
నేను హిట్లర్ని కాను........ వాని అయ్యను.....
చూస్తివా ? గుడ్లు పీకేస్తా !వెంటపడితివా? తోలు తీస్తా !అంటుకుంటే? అవయవాలు తొలగిస్తా!అయినా ఆగక పోతే లేపేస్తా!నేను హిట్లర్ని కాను?వాని అయ్యను అన్న ఓ అయ్యా!నీ పదాల పథఘోష ఆగకముందేనా వొళ్లంతా తడిమేస్తున్నాయి... ఆ చేతలునిమిషానికో గాంధారి పుత్రుడునాపై దాడి చేస్తున్నాడుముదిసిలినైనా పసిమినైనాప్రాధేయపడినా వాడుకసికసిగా మాప్రాణం తీస్తున్నాడు...ఓ అయ్యా ! నాకు హిట్లర్ వద్దువాని అయ్య వద్దుఈ అకృత్యాల మొదళ్ళ పెకిలించేఅయ్యలు కావాలి...మమ్ము ఆదుకొనే అయ్యలు రావాలిమాకు నిజమైన బతుకు నివ్వాలి.... ఓ మానవి వేదన - పి.ఎన్ మూర్తి. pnmoor@gmail.com 9441151672
Saturday, May 3, 2014
పేదరాలిపై పైశాచికం

- మూడు రోజులుగా వెలుగుచూడని ఘోర కలి
అత్యాచారాలకూ మార్కెటు విలువలుంటాయా? అని ప్రశ్నించుకుంటే ప్రతిదీ వ్యాపారమయమైన నేటి సమాజంలో అవుననే అనిపిస్తుంది. రాక్షసత్వాన్ని రచ్చకీడ్చాల్సిన మీడియా స్పందించలేదు. పైశాచికత్వాన్ని ప్రజల ముందుకు తెచ్చి కిరాతకాన్ని కడిగిపారేయేయాల్సిన మీడియా మూగవోయిందెందుకు? ఢిల్లీలో వైద్య విద్యార్థినిపై జరిగిన దారుణ అత్యాచారాన్ని అంతర్జాతీయ స్థాయిలో సంచలనాత్మకం చేసిన మీడియా, రాజధాని హైదరాబాదుకు సమీపంలోని ఓ పల్లెలో ఘోరాతిఘోరంగా జరిగిన సామూహిక అ
త్యాచారాన్ని, అవమానంతో ఆమె ప్రాణాలు తీసుకున్న వైనాన్ని నిలువునా పాతరేసింది. ఈ దుర్యోధన, దుశ్శాసన పర్వంలో ఓ పేదరాలి ఘోషను వినబడకుండా చేసింది. ఎన్నికల జాతరతో హోరెత్తిన మీడియాలో కొన్ని మానవ మృగాలు జరిపిన వికృత క్రీడ వార్త కాకుండా పోయిందా? 'ప్రజాశక్తి, 10టివి' ఈ దారుణాన్ని వెలికి తెచ్చాయి. మెదక్ జిల్లా తునికిబొల్లారంలో జరిగిన ఈ ఘోర కలి సమాజానికి తీరని అవమానంగా మిగిలింది.
Subscribe to:
Posts (Atom)